Suryapet: హెడ్ కానిస్టేబుల్ కూతురు ఐఎఫ్ఎస్‌కు ఎంపిక

Suryapet: హెడ్ కానిస్టేబుల్ చల్లా యాదగిరి కూతురు యామిని ఐఎఫ్ఎస్‌కు ఎంపిక కావడంతో ఎస్పీ నరసింహ అభినందించి సన్మానించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 9 May 2026 2:00 PM IST
Suryapet
X

Suryapet

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణంగా, సూర్యాపేట రూరల్ సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చల్లా యాదగిరి కూతురు యామిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైంది.

జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ యాదగిరిని, ఆయన కూతురు యామిని ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లో భాగంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ పోలీస్ సిబ్బంది కుటుంబాలకు సమయం కేటాయించి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని ఎస్పీ ప్రశంసించారు.

ఐఎఫ్ఎస్‌కు ఎంపికైన యామిని పరీక్షలకు సిద్ధమైన విధానం, శిక్షణ గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మరిన్ని అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం మిఠాయిలు పంచి అందరికీ తీపి పంచారు.

కూతురు సమక్షంలోనే యాదగిరిని సన్మానించిన ఎస్పీ, యామిని మంచి లక్ష్యాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. పోలీస్ సిబ్బంది కూడా తమ పిల్లల చదువులు, లక్ష్యాలపై దృష్టి పెట్టి వారికి దిశానిర్దేశం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంక్షేమ ఆర్ఎస్ఐ సాయిరాం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story