Gurrampode: గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకిస్ట్ పరిస్థితి విషమం!

Gurrampode: నల్లగొండ-దేవరకొండ రహదారిపై గుర్రంపోడులో కారు, బైక్ ఎదురెదురుగా ఢీ. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు.

Saleem, Nalgonda
Published on: 3 Aug 2026 6:55 PM IST
Gurrampode
X

Gurrampode: గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకిస్ట్ పరిస్థితి విషమం!

గుర్రంపోడు: నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని నల్లగొండ - దేవరకొండ ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

వేగంగా వస్తున్న కారు, బైకు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story