Nalgonda: కేటీఆర్‌వి కొత్త డ్రామాలు కాంగ్రెస్ సంక్షేమం చూసి ఓర్వలేకే!

Nalgonda: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య బీఆర్‌ఎస్‌పై విమర్శలు కేటీఆర్‌వి డ్రామాలంటూ ఫామ్‌హౌస్‌ పాలనపై మండిపాటు.

Saleem, Nalgonda
Published on: 4 Sept 2026 7:16 PM IST
Nalgonda
X

Nalgonda: కేటీఆర్‌వి కొత్త డ్రామాలు కాంగ్రెస్ సంక్షేమం చూసి ఓర్వలేకే!

Nalgonda: బీఆర్‌ఎస్‌ తన గత తొమ్మిదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ఫామ్‌హౌస్‌ పాలనకే పరిమితమైందని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేకే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు.. ఇప్పుడు ఓటమితో గద్దె దిగాక రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story