Nalgonda: వరకట్న వేధింపుల కేసులో నలుగురికి 6 నెలల జైలు శిక్ష

Nalgonda: పోలీస్ స్టేషన్ పరిధిలోని వరకట్న వేధింపులు, కుల దూషణ కేసులో నలుగురు నిందితులకు 6 నెలల జైలు శిక్ష విధించిన ప్రత్యేక సెషన్స్ కోర్టు. వివరాలు వెల్లడించిన ఎస్పీ.

Saleem, Nalgonda
Published on: 21 Aug 2026 5:32 PM IST
Nalgonda
X

Nalgonda: వరకట్న వేధింపుల కేసులో నలుగురికి 6 నెలల జైలు శిక్ష నల్లగొండ కోర్టు తీర్పు

Nalgonda: నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వరకట్న వేధింపులు, కుల దూషణ కేసులో నలుగురు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ ప్రత్యేక సెషన్స్ కోర్టు తీర్పు చెప్పిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

​2021లో నమోదైన ఈ కేసులో నిందితులు కల్లూరి స్వామి నాధ్, ప్రమీల, కల్లూరి యాదయ్య, కల్లూరి ఎల్లయ్యలపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి ఆధారాలు సమర్పించిన డీఎస్పీ జి.వెంకటేశ్వర్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహతో పాటు ఇతర పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story