Nalgonda: పానగల్లు బైపాస్‌లో చేపల మార్కెట్ నిర్మించాలి: కలెక్టర్‌కు వినతి!
Nalgonda: నల్లగొండ పానగల్లు బైపాస్ రోడ్డులో నూతన చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని మత్స్యకారుల శ్రామిక సంఘం జిల్లా కలెక్టర్‌ను కోరింది.
Nalgonda: పానగల్లు బైపాస్‌లో చేపల మార్కెట్ నిర్మించాలి: కలెక్టర్‌కు వినతి!
నల్లగొండ: నల్లగొండ పట్టణం లోనే పానగల్లు బైపాస్ రోడ్డులో నూతన చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ మత్స్యకారుల శ్రామిక సంఘం ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా దాదాపు 100 మత్స్యకారుల కుటుంబాలు ఇక్కడే రోడ్డుపై చేపలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
ప్రధాన రహదారిపై వ్యాపారం చేయడం వల్ల పోలీసులు, పురపాలక అధికారులు నిత్యం ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని, పానగల్లు ప్రాంతంలో ప్రత్యేకంగా చేపల మార్కెట్ నిర్మించి ఆదుకోవాలని వారు కోరారు.
Next Story




