Nalgonda: నాగార్జునసాగర్ రహదారిపై కారు బైక్‌ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం!
Nalgonda: నాగార్జునసాగర్ రహదారిపై నెల్లికల్ ఎక్స్ రోడ్ వద్ద కారు బైక్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Nalgonda: నాగార్జునసాగర్ రహదారిపై కారు బైక్‌ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం!
Nalgonda: నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లికల్ ఎక్స్ రోడ్ సమీపంలోని దయ్యాల గండి వద్ద వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న నాగార్జునసాగర్ పైలాన్‌కు చెందిన వ్యక్తి తీవ్ర గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
సంఘటనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




