Nalgonda: రైతులు నాట్లు వేయండి, నీళ్ల కోసం కొట్లాడుదాం.. మాజీ మంత్రి!

Nalgonda: నల్గొండ BRS కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమావేశం. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, సాగర్ నీటి విడుదలపై కేటీఆర్ పాదయాత్ర హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Sept 2026 12:27 PM IST
Nalgonda
X

Nalgonda: రైతులు నాట్లు వేయండి, నీళ్ల కోసం కొట్లాడుదాం.. మాజీ మంత్రి!

Nalgonda: నల్గొండ జిల్లా BRS కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగదీశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నాగర్జున సాగర్ ఆయకట్ట కింద రైతులంతా నాట్లు వేయండి నీళ్ల కోసం కొట్లడుదమన్నారు.

ఎడమ కాల్వ, AMRP, SLBC కింద ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి తీరాల్సిందే.. లేదంటే అంతు చూస్తామన్నారు మాజీ మంత్రి. సాగర్ ఎడమ కాల్వ నీటి విడుదల షెడ్యూల్ ఇవ్వకపోతే కేటీఆర్ పాదయాత్ర చేస్తారని చెప్పారు. భూ భారతి పేరుతో 22A పెట్టి కోటి ఎకరాలను బ్లాక్ చేశారు.

మంత్రులంతా దోచుకునే పనిలోనే బిజీ ఉన్నారని విమర్శించారు. నీళ్ల దొంగ చంద్రబాబు 200 టీఎంసీలు తోడుకెళ్తుంటే సీఎం, మంత్రులు సోయి లేకుండా చూస్తున్నారని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్