Nalgonda: నల్లగొండ జిల్లాలో కథల్‌గూడ సబ్ సెంటర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!
Nalgonda: నల్లగొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కథల్‌గూడ సబ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డా. కె. రాహుల్.
Nalgonda: నల్లగొండ జిల్లాలో కథల్‌గూడ సబ్ సెంటర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ!
Nalgonda: నల్గొండ (M)రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కథల్‌గూడ సబ్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్‌ఓ) డా. కె. రాహుల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్‌లోని రికార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలు మరియు వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సిబ్బంది రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, అత్యవసర మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.




