Suryapet: సూర్యాపేట జిల్లాలో విషాదం: అనారోగ్యంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య!

Suryapet: సూర్యాపేట జిల్లా గుర్రంపోడు మండలం పిట్టలగూడెంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఆటో డ్రైవర్ బైరి యాదగిరి ఆత్మహత్య చేసుకున్నాడు.

Saleem, Nalgonda
Published on: 1 Sept 2026 7:18 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో విషాదం: అనారోగ్యంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య!

Suryapet: అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా గుర్రంపోడు మండలం పిట్టలగూడెంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకన్న కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బైరి యాదగిరి(43) వ్యవసాయం చేస్తూ, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అతడు గత పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యాధి బాధ తాళలేక బలవన్మరణానికి ఒడిగట్టాడు. మృతుని తమ్ముడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story