Devarakonda: ఓటరు జాబితా సవరణ (SIR) పారదర్శకంగా జరగాలి
Devarakonda: దేవరకొండ చెరువుపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఓటరు జాబితా సవరణ (SIR) సమీక్ష సమావేశం.
Devarakonda: ఓటరు జాబితా సవరణ (SIR) పారదర్శకంగా జరగాలి
Devarakonda: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని నల్గొండ డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పిలుపునిచ్చారు. మండలంలోని చెరువుపల్లి ఎక్స్ రోడ్డులోని ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన SIR సమీక్ష సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాబితా సవరణ ప్రక్రియలో BLAలు, BLOలు మరియు బూత్ లెవెల్ కో-ఆర్డినేటర్లు పూర్తి సమన్వయంతో ముందుకుసాగాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, తొలగింపుల అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
Next Story




