Nalgonda: చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలి
Nalgonda: నల్గొండలో ఫుట్ పాత్ చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీయవద్దని సీపీఎం డిమాండ్. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు దాడులు చేయడం సరికాదని హితవు.
Nalgonda: చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలి
నల్గొండ: నల్గొండ పట్టణ అభివృద్ధి పేరుతో ఫుట్ పాత్ చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీయవద్దని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం పట్టణ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్ మాట్లాడారు.
హైదరాబాద్ రోడ్డు, పెద్ద గడియారం నుంచి స్టేడియం వరకు, దేవరకొండ రోడ్డు ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు ఫుట్ పాత్ వ్యాపారాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి, వారి సరుకులను చిందరవందర చేయడం సరికాదన్నారు.
చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు లేదా దుకాణ సముదాయాలు కేటాయించి వారి ఉపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి అవకాశాలు పెంచడం కూడా అభివృద్ధిలో భాగమేనని గుర్తుచేశారు.




