Nalgonda: నల్లగొండలో మోదీ దిష్టిబొమ్మ దహనం
Nalgonda: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై నల్లగొండలో సీపీఐ శ్రేణులు భగ్గుమన్నాయి.
Nalgonda: మోడీ ప్రభుత్వంపై సీపీఐ ఫైర్..
నల్గొండ: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా శనివారం జిల్లా కేంద్రంలో సీపీఐ శ్రేణులు భగ్గుమన్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పప్పు వీరస్వామి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులు ఖాళీ చేస్తూ, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల జేబులు నింపుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. చమురు ధరల పెంపు ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీనివల్ల పేదలపై తీవ్ర భారం పడుతోందని మండిపడ్డారు.




