Nalgonda: ప్రజా వ్యతిరేక బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి: సీపీఐ గళం!
Nalgonda: కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలని నల్గొండలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పిలుపునిచ్చారు.
Nalgonda: ప్రజా వ్యతిరేక బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి: సీపీఐ గళం!
నల్గొండ: కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్.శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.
శుక్రవారం నల్గొండ పట్టణంలో నిర్వహించిన సీపీఐ ప్రజా చైతన్య యాత్రలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కేంద్రం నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడుం విరిచిందని విమర్శించారు.
Next Story




