Nalgonda: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: గుత్తా సుఖేందర్ రెడ్డి

Nalgonda: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 13 Sept 2026 7:26 PM IST
Nalgonda
X

Nalgonda: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

“వినాయక చవితి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలి. ప్రజలందరి జీవితాల్లో ఎదురయ్యే విఘ్నాలు తొలగి, చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నానని అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

వినాయక మండపాల వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ వినాయక చవితి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన కోరారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET