Nalgonda: నల్గొండలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆందోళన!
Nalgonda: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలని నల్గొండ క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసన.
Nalgonda: నల్గొండలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆందోళన!
Nalgonda: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన స్పీకర్‌పై బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఎమ్మెల్సీ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




