Suryapet: రాష్ట్రానికి పట్టింది 'కాంగ్రెస్' దయ్యం..మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి!
Suryapet: తెలంగాణకు వచ్చింది ఎల్ నినో దయ్యం కాదని, కాంగ్రెస్ దయ్యమంటూ సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్ర విమర్శ. కృష్ణా, గోదావరి నీటి తరలింపుపై మండిపాటు.
Suryapet: రాష్ట్రానికి పట్టింది 'కాంగ్రెస్' దయ్యం..మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి!
Suryapet: రాష్ట్రానికి వచ్చింది ‘ఎల్ నినో’ దయ్యం కాదని, ‘కాంగ్రెస్’ దయ్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటి విడుదలపై ప్రశ్నిస్తే మంత్రులు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు.
ఏ సమస్యనైనా ఎల్ నినో ప్రభావమంటూ తప్పించుకుంటున్నారని, అయితే గోదావరి, కృష్ణా నదుల్లో ప్రస్తుతం నీళ్లు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
మన హక్కుగా రావలసిన నీరు పొరుగు రాష్ట్రమైన ఏపీకి తరలిపోతున్నట్లు ఆధారాలతో సహా చూపుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. పక్కా పథకం ప్రకారమే తెలంగాణలో పంటలు ఎండిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు.




