Nakrekal: రాహుల్ గాంధీపై అక్రమ కేసులు ఎత్తివేయాలి!
Nakrekal: నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. రాహుల్ గాంధీపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించిన మండల పార్టీ అధ్యక్షుడు కొండయ్య గౌడ్.
Nakrekal: రాహుల్ గాంధీపై అక్రమ కేసులు ఎత్తివేయాలి!
Nakrekal: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గాదగోని కొండయ్య గౌడ్ ఆధ్వర్యంలో
ఈ సందర్భంగా గాదగోని కొండయ్య గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తూ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలపై రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఇప్పటికీ అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన కొండయ్య గౌడ్.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు...
రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ, బూటకపు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




