Nalgonda: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు: కలెక్టర్ చంద్రశేఖర్!
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
Nalgonda: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు: కలెక్టర్ చంద్రశేఖర్!
నల్గొండ: ప్రజావాణి’కి వచ్చే అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో పెట్టకుండా, ప్రజల్లో నమ్మకం కలిగేలా బాధ్యతాయుతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సోమవారం నుంచే మండల స్థాయిలోనూ ప్రజావాణి ప్రారంభమైందని తెరిపిన కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు సైతం క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. మండల ప్రజావాణిలో స్వయంగా పాల్గొని ప్రజల సమస్యలను అక్కడికక్కడే తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
Next Story




