Nakrekal: నేడు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి రూ.315 కోట్లతో అభివృద్ధి పనులు!

Nakrekal: నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన, రాజీవ్ గాంధీ స్టేడియంలో ప్రజా వికాస సభ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Sept 2026 12:28 PM IST
Nakrekal
X

Nakrekal: నేడు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి రూ.315 కోట్లతో అభివృద్ధి పనులు!

Nakrekal: ఈ రోజు న‌ల్గొండ జిల్లా న‌కిరేక‌ల్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు న‌కిరేక‌ల్ చేరుకోనున్న ముఖ్య‌మంత్రి. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్న సీఎం.

అనంత‌రం రాజీవ్ గాంధీ స్టేడియంలో జ‌రిగే ప్ర‌జా వికాస‌ భారీ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొనున్న ముఖ్య‌మంత్రి.

అభివృద్ధి పనుల వివరాలు:

సబ్‌స్టేషన్ శంకుస్థాపన: మునిపంపుల గ్రామంలో ₹3.62 కోట్ల వ్యయంతో నిర్మించే 1×5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR), 33/11 KV సబ్‌స్టేషన్, 33 KV & 11 KV విద్యుత్ లైన్లు మరియు కంట్రోల్ రూమ్ పనులకు శంకుస్థాపన.

సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం: కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో ₹2.74 కోట్లతో నిర్మించిన 1×5 MVA PTRతో కూడిన 33/11 KV సబ్‌స్టేషన్ మరియు 33 KV, 11 KV లైన్ల ప్రారంభోత్సవం.

తెలంగాణ పబ్లిక్ స్కూల్: నకిరేకల్ నియోజకవర్గంలో ₹9.85 కోట్ల వ్యయంతో నిర్మించే తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS) భవనానికి శంకుస్థాపన.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్: నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ₹200 కోట్ల వ్యయంతో నిర్మించే "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్"కు శంకుస్థాపన.

మండల కార్యాలయాల సముదాయం: నకిరేకల్ మండలంలో ₹20 కోట్లతో నిర్మించే సమీకృత మండల స్థాయి కార్యాలయాల సముదాయానికి (MDO/MRO complex) శంకుస్థాపన.

రహదారుల అభివృద్ధి: ₹45.60 కోట్ల వ్యయంతో చేపడుతున్న కింది రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నకిరేకల్–గురజాల రోడ్ నుండి బైరౌనిబండ వరకు

బైరౌనిబండ నుండి అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్ వరకు

అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్డు విస్తరణ/అభివృద్ధి పనులు

ఎక్సైజ్ స్టేషన్: నకిరేకల్‌లో ₹1.10 కోట్లతో నిర్మించనున్న 'ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్' భవనానికి శంకుస్థాపన.

100 పడకల ఆసుపత్రి: నకిరేకల్‌లో ₹32 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story