Nalgonda: కేంద్రం కార్పొరేట్ అనుకూల విధానాలపై నల్గొండలో నిరసన!
Nalgonda: కేంద్ర ప్రభుత్వం కనీస వేతన సలహా బోర్డు నుంచి ప్రధాన కార్మిక సంఘాలను మినహాయించడం దుర్మార్గమని నల్గొండలో సిఐటియు ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
Nalgonda: కేంద్రం కార్పొరేట్ అనుకూల విధానాలపై నల్గొండలో నిరసన!
నల్గొండ: కేంద్ర ప్రభుత్వం కనీస వేతన సలహా బోర్డు నుంచి ప్రధాన కార్మిక సంఘాలైన సిఐటియు, ఐఐటియుసి, ఐఎన్‌టియుసిలను మినహాయించడం తీవ్ర దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు ఈ నిర్ణయం నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం నల్గొండలోని నెహ్రూగంజ్‌లో సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోర్డులో ప్రధాన సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అప్రజాస్వామికమన్నారు. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకే వేతన సలహా బోర్డును తనకు అనుకూలమైన వారితో పునర్వ్యవస్థీకరించిందని ఆరోపించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా కార్మికుల నిజమైన ఆదాయాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.




