Nalgonda: పవర్లూమ్ కార్మికుల కూలీ రేట్లు వెంటనే పెంచాలి: సీఐటీయూ
Nalgonda: సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం పవర్లూమ్ కార్మికుల కూలీ రేట్లను పెంచాలని, సెప్టెంబర్ 30 లోగా నూతన వేతన ఒప్పందం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Nalgonda: పవర్లూమ్ కార్మికుల కూలీ రేట్లు వెంటనే పెంచాలి: సీఐటీయూ
నల్గొండ: పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలీ రేట్లను వెంటనే పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్గొండ జిల్లా కమిటీ సమావేశం గంజి నాగరాజు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ...
నూతన ఒప్పందం: సెప్టెంబరు 30 నాటికి పాత కూలీ రేట్ల ఒప్పంద గడువు ముగుస్తున్నందున, యజమానులు తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కొత్త రేట్లను ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story




