Nalgonda: తప్పిన ఘోర ప్రమాదం విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్!
Nalgonda: నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మినీ గూడ్స్ వాహనం బోల్తా.
Nalgonda: తప్పిన ఘోర ప్రమాదం విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్!
Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మినీ గూడ్స్ వాహనం బీభత్సం సృష్టించింది.హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు పెయింటింగ్ కలర్ డబ్బాలు, లప్పం బ్యాగుల లోడ్‌తో వెళ్తున్న మినీ గూడ్స్ వాహనం.. చిట్యాల వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ కంటైనర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.
వెనుక నుండి బలంగా ఢీకొనడంతో మినీ గూడ్స్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.వాహనంలో ఉన్న పెయింటింగ్ కలర్ డబ్బాలు, లప్పం బ్యాగులన్నీ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయి చెల్లాచెదురుగా పడిపోవడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఈ ప్రమాదంలో మినీ గూడ్స్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను సజావుగా పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.




