Miryalaguda: మిర్యాలగూడలో చైన్ స్నాచర్ అరెస్ట్

Miryalaguda: మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ నిందితుడు గోపీచంద్‌ను పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 29 April 2026 1:21 PM IST
Miryalaguda
X

Miryalaguda

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న గోపీచంద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఈ విషయంపై డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ, పట్టణంలోని రెడ్డి కాలనీలో ఓ వృద్ధురాలి గొలుసు లాక్కొని పారిపోయిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

నిందితుడి వద్ద నుంచి సుమారు నాలుగు తులాల బంగారం, ఒక మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story