Suryapet: మొదటి అలైన్‌మెంట్‌లోనే బుల్లెట్ రైలు కొనసాగించాలి: మల్లు లక్ష్మి!

Suryapet: కేంద్రం మొదట ప్రతిపాదించిన ఎన్‌హెచ్-65 అలైన్‌మెంట్‌ ప్రకారమే బుల్లెట్ రైలును కొనసాగించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 27 Aug 2026 7:00 PM IST
Suryapet
X

Suryapet: మొదటి అలైన్‌మెంట్‌లోనే బుల్లెట్ రైలు కొనసాగించాలి: మల్లు లక్ష్మి!

సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వం మొదట ప్రతిపాదించిన అలైన్ మెంట్ ప్రకారం జాతీయ రహదారి వెంటనే బుల్లెట్ ట్రైన్ ను కొనసాగించే వరకు ఉద్యమం ఆగదని ఐద్వా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు గురువారం 14వ రోజుకు చేరుకున్నాయి.

ఈ దీక్షలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేయాలన్నారు. నాయకుల స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

లక్షల కోట్లతో మంజూరైన బుల్లెట్ ట్రైన్ లక్షల మంది రోజూ ప్రయాణించే జాతీయ రహదారి 65 వెంట కొనసాగించాల్సి ఉండగా, అవసరం లేని చోటకు దారి మళ్లించడం సరికాదన్నారు. గత 40 రోజులుగా సూర్యాపేట, నకిరేకల్, కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ దారి మళ్లింపు వ్యతిరేక ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజా ఉద్యమం మరింత ఉధృతమవుతుందని అన్నారు.

ఈ దీక్షలో జ్యోతి, వెంకట, చంద్ర, సైదమ్మ, రజిత, రమాదేవి, విజయలక్ష్మి, నాగమణి, కిజాబీ, లక్ష్మమ్మ, సుభద్ర, అమృతమ్మ, జానమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు.

మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నాగార్జున ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, తండు శ్రీనివాస్ యాదవ్, రమణాచారి, డేవిడ్ కుమార్, బూర వెంకటేశ్వర్లు, చలవాల నర్సింహ, యాదగిరిరావు, వేల్పుల వెంకన్న, జర్నలిస్టు కందుకూరి యాదగిరి, భయ్యా మల్లయ్య యాదవ్, తుంగతుర్తి పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story