Suryapet: బుల్లెట్ ట్రైన్ పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలి తాటికొండ సీతయ్య

Suryapet: హైదరాబాద్ - విజయవాడ బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను మార్చవద్దని బీఆర్‌ఎస్ నేత తాటికొండ సీతయ్య డిమాండ్. మార్చితే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Aug 2026 2:18 PM IST
Suryapet
X

Suryapet: బుల్లెట్ ట్రైన్ పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలి తాటికొండ సీతయ్య

Suryapet: హైదరాబాద్ – విజయవాడ బుల్లెట్ ట్రైన్ పాత అలైన్‌మెంట్‌ను మార్చకూడదని, జాతీయ రహదారికి అనుసంధానంగా గతంలో ఇచ్చిన ప్రతిపాదనలనే యథావిధిగా కొనసాగించాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపిపి తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను కొత్తగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని, అలైన్‌మెంట్ మార్చడం అంటే సూర్యాపేట జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడమేనని పేర్కొన్నారు.

బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ సాధన కోసం గత పది రోజులుగా సూర్యాపేటలో నిరాహార దీక్షలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ పెద్దలు గానీ, రైల్వే అధికారులు గానీ స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని, లేనియెడల బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మాజీ సర్పంచ్ వీరోజీ నాయక్, బల్లెం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story