Suryapet: సూర్యాపేటలో బీఆర్‌ఎస్ రాస్తారోకో స్తంభించిన హైవే!
Suryapet: సూర్యాపేట అంజనాపురి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ శ్రేణుల భారీ రాస్తారోకో. హైదరాబాద్ విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.
Suryapet: సూర్యాపేటలో బీఆర్‌ఎస్ రాస్తారోకో స్తంభించిన హైవే!
Suryapet: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట అంజనాపురి చౌరస్తా వద్ద గల నేషనల్ హైవేపై వందలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నల్ల దుస్తులు ధరించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారని, దీంతో ఆందోళన మరింత ఉధృతమైందని తెలిపారు.
ఈ రాస్తారోకో కారణంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కొనసాగించారు.




