Peddavoora: పెద్దవూర వద్ద బీఆర్‌ఎస్ రాస్తారోకో రహదారి దిగ్బంధం!

Peddavoora: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులకు నిరసనగా పెద్దవూర వద్ద కోదాడ జడ్చర్ల రహదారిపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో రాస్తారోకో.

Saleem, Nalgonda
Published on: 7 Sept 2026 12:49 PM IST
Peddavoora
X

Peddavoora: పెద్దవూర వద్ద బీఆర్‌ఎస్ రాస్తారోకో రహదారి దిగ్బంధం!

Peddavoora: బీఆర్‌ఎస్‌ శాసనసభ్యుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నల్లగొండ జిల్లా పెద్దవూర వద్ద కోదాడ - జడ్చర్ల రహదారిపై గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.

​కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ ఆందోళన కారణంతో జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story