Kodad: కోదాడ బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ భారీ ధర్నా!
Kodad: అసెంబ్లీ ఎదుట బీఆర్‌ఎస్ నేతలపై దాడిని ఖండిస్తూ కోదాడ బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ధర్నా, నిరసన.
Kodad: కోదాడ బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ భారీ ధర్నా!
Kodad: అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళా ప్రజా ప్రతినిధులు అని కూడా చూడకుండా దౌర్జన్యాలకు పాల్పడటం ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని ఆరోపించారు.
అసెంబ్లీ ఎదుట జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




