Suryapet: పంచాయతీ అని పిలిచి మధును చంపేశారు.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Suryapet: సూర్యాపేటలో దారుణ హత్యకు గురైన చింతలపాటి మధు మృతదేహాన్ని పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
Suryapet: పంచాయతీ అని పిలిచి మధును చంపేశారు.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో హత్యకు గురైన చింతలపాటి మధు మృతదేహాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జనరల్ ఆసుపత్రి మార్చురీలో పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మధు హత్యను తీవ్రంగా ఖండించారు. నల్లగొండ జిల్లా గతంలో కక్షలు, కార్పణ్యాలకు పెట్టింది పేరని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి కేసులు నమోదు కాకుండా పాలన సాగిందని, ప్రస్తుతం పోలీసు స్టేషన్లలో కాంగ్రెస్ నాయకుల జోక్యం పెరిగిందని ఆరోపించారు.
గతంలో యర్కారం మండలంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్య విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్లామని తెలిపారు. పంచాయతీ మాట్లాడటానికి పిలిచి మధును హత్య చేశారని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే పోలీసులు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. మధు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, పిల్లల చదువు, పోషణ బాధ్యత తాను తీసుకుంటానని జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు.




