Suryapet: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల వినతి!
Suryapet: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల వినతిపత్రం. పెన్షన్లు, డ్రైనేజీ, వీధి కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Suryapet: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల వినతి!
Suryapet: జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర తొలి విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అంగిరేకుల నాగార్జున ఆధ్వర్యంలో ఈ వినతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధాన డిమాండ్లు:
పెన్షన్ల పంపిణీ: రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు అందించాలి
అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్: రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని పట్టణ వ్యాప్తంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
నీటి సరఫరా: ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలి
వీధి కుక్కల నియంత్రణ: విచ్చలవిడిగా పెరిగిన వీధి కుక్కలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి
సూర్యాపేట పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఈ వినతి పత్రం అందజేసినట్లు కౌన్సిలర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్, ఈద ప్రవీణ్, తాహెర్ బిన్ పాషా, భూక్యా జ్యోతి లింగ నాయక్, ధారావత్ విజయ చక్రు నాయక్, బత్తుల ఝాన్సీ రమేష్, పోతురాజు ఇందుశ్రీ అనిల్, చిరివెళ్ళ లక్ష్మీ కాంతమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




