Nalgonda: సెప్టెంబరులోనూ వర్షాలు కష్టమే ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరమని కలెక్టర్ సూచన
Nalgonda: సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు క్షీణించాయని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు.
Nalgonda: సెప్టెంబరులోనూ వర్షాలు కష్టమే ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరమని కలెక్టర్ సూచన
నల్గొండ: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా లేక ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు క్షీణించాయని, ఎగువ నుంచి సాగునీరు వచ్చే అవకాశం లేదని నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు.
తాగు, సాగునీటి అవసరాలపై ప్రణాళిక రచనకు సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.
సెప్టెంబరులోనూ సూపర్ ఎల్ నినో వల్ల దక్షిణ తెలంగాణలో వర్షసూచన లేదని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు పంటల మార్పిడి చేపట్టి ఆరుతడి పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు.
Next Story




