Suryapet: సూర్యాపేటలో ఘనంగా ఏఐకేఎంఎస్ మహాసభల పోస్టర్ రిలీజ్!
Suryapet: సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాలలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు.
Suryapet: సూర్యాపేటలో ఘనంగా ఏఐకేఎంఎస్ మహాసభల పోస్టర్ రిలీజ్!
Suryapet: సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాలలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సూర్యాపేట జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డేవిడ్ కుమార్ మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, దీనికి కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, సరళీకరణ ఆర్థిక విధానాలే కారణమన్నారు.
ఢిల్లీ రైతాంగ పోరాటాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని, ఇది రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి లేకపోవడాన్ని తెలియజేస్తోందన్నారు. సామ్రాజ్యవాద దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న అసమాన ఒప్పందాల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని, కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు.
32 దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ముఖ్యంగా అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు రైతాంగానికి గుదిబండగా మారబోతున్నాయని, వెంటనే ఈ అసమాన ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బహుళజాతి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అనుమతి లేకుండా కోట్లాది రూపాయల విత్తన వ్యాపారం జరుగుతోందని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
రాబోయే మహాసభల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, బలమైన రైతు కూలీ ఉద్యమాన్ని నిర్మించి పాలకుల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోటు లక్ష్మయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్, జిల్లా నాయకులు అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, మేకల కనకారావు, భయ్యా లింగయ్య, జిలేరు, సంజీవరెడ్డి, మైబెల్లి, జాజుల సామేలు, దాసరి శ్రీను, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.




