Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో అఖిల భారత రైతు-కూలీ సంఘం నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం
Nalgonda: రైతులకు గుదిబండగా మారిన యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత రైతు-కూలీ సంఘం (AIKMS) డిమాండ్ చేసింది.
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్‌లో అఖిల భారత రైతు-కూలీ సంఘం నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, సాగుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత రైతు-కూలీ సంఘం డిమాండ్ చేసింది. నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే యూరియా ఇస్తామనడం సరికాదన్నారు.
Next Story




