Nalgonda: నల్లగొండ మాన్యం చెల్క వక్ఫ్ భూములను పరిరక్షించాలి!

Nalgonda: నల్లగొండ మాన్యం చెల్క వక్ఫ్ భూముల పరిరక్షణపై చర్యలు వేగవంతం చేయాలని బోర్డు చైర్మన్‌కు అహ్మద్ కలీమ్ విజ్ఞప్తి.

Saleem, Nalgonda
Published on: 4 Sept 2026 6:04 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ మాన్యం చెల్క వక్ఫ్ భూములను పరిరక్షించాలి!

Nalgonda: నల్లగొండ పట్టణంలోని మాన్యం చెల్క ప్రాంతంలో ఉన్న వక్ఫ్ భూముల పరిరక్షణకు తక్షణమే చర్యలు వేగవంతం చేయాలని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీకి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సామాజిక కార్యకర్త అహ్మద్ కలీమ్ విజ్ఞప్తి చేశారు. నాంపల్లిలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఛైర్మన్‌ను గురువారం కలిసి భూ వివాదం, న్యాయపరమైన అంశాలను వివరించారు.

​దీనిపై సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది, బోర్డు లీగల్ కౌన్సెల్ ఫర్హాన్ ఆజమ్ ఖాన్‌తో ఫోన్లో మాట్లాడారు. కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వే నంబర్ 35లోని 1-22 ఎకరాల భూమి సహా, పరిసర సర్వే నంబర్లలోని సుమారు 6.24 ఎకరాల భూ పరిరక్షణపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story