Suryapet: సూర్యాపేట టీపీఓ సోమయ్య నివాసంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

Suryapet: సూర్యాపేట మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) సోమయ్య నివాసంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. పలు కీలక పత్రాలు, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 3 Sept 2026 1:41 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట టీపీఓ సోమయ్య నివాసంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు!

Suryapet: సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) సోమయ్య నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేపట్టారు. స్థానిక మానస నగర్ లోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇంట్లోని పలు ప్రాంతాలను పరిశీలిస్తూ నగదు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన నిర్మాణ అనుమతులు, లేఔట్ల అనుమతులు, నిబంధనల అమలు వంటి కీలక అంశాలు ఉండటంతో ఈ సోదాలు మున్సిపల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఆదాయానికి మించి ఆస్తులు, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఏమైనా ఆధారాలు లభించాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తనిఖీలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. కాగా టీపీఓ సోమయ్యపై గతంలో కూడా విధి నిర్వహణకు సంబంధించి పలు విమర్శలు వచ్చినట్లు తెలుస్తోంది.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story