Suryapet: సూర్యాపేట పోలీసులకు ప్రమోషన్ల పండుగ.. 10 మంది ఏఎస్ఐలు ఇక ఎస్సైలు!
Suryapet: సూర్యాపేట జిల్లా పోలీసు శాఖలో పదోన్నతుల సందడి నెలకొంది.
Suryapet: సూర్యాపేట పోలీసులకు ప్రమోషన్ల పండుగ.. 10 మంది ఏఎస్ఐలు ఇక ఎస్సైలు!
సూర్యాపేట: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 10 మంది ఏఎస్ఐలు ఎస్సై ప్రమోషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎస్ఐలు ఎస్.వెంకటేశ్వరావు, టి.సత్యనారాయణ, షేక్ జానిమియా, బలరాం రెడ్డి, కేపీ చారి, ఎం వెంకయ్య, ఎం శంకర్, వెంకటరత్నం, సుధాకర్ రెడ్డి, నికోలస్ ఉన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ వారికి అభినందనలు తెలిపారు. మూడు నెలల శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టి సమర్థవంతంగా, నైపుణ్యంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో ముందుండాలని, తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలవాలని కోరారు. కింది స్థాయి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడంలో కృషి చేయాలని అన్నారు. అనంతరం వెంటనే తమ తమ పోలీస్ స్టేషన్లలో విధులకు హాజరుకావాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, పోలీసు సంఘం అధ్యక్షులు రామచంద్ర గౌడ్ పాల్గొన్నారు.




