Yash: షూటింగ్‌ టైంలోనే మొత్తం మారిపోయింది.. ‘టాక్సిక్’ డిజాస్టర్‌పైయశ్ ఫస్ట్ రియాక్షన్!

Yash: రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' బాక్సాఫీస్ పరాజయంపై తొలిసారి స్పందించారు.

Gagan kumar
Published on: 10 Sept 2026 12:16 PM IST
Yash
X

Yash: షూటింగ్‌ టైంలోనే మొత్తం మారిపోయింది.. ‘టాక్సిక్’ డిజాస్టర్‌పైయశ్ ఫస్ట్ రియాక్షన్!

Yash Toxic movie: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్, ఆ తర్వాత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఆ తర్వాత కలెక్షన్లను నిలబెట్టుకోలేకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం సాగింది.

ఈ పరాజయంపై మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, హీరో యశ్ మొదటి స్పందన ఏమిటనేది డబ్బింగ్ సూపర్‌వైజర్ జయదేవ్ మోహన్ వెల్లడించారు. సినిమా ఫలితంపై యశ్ ఏమన్నారో ఓ ఇంటర్వ్యూలో వివరిస్తూ.. రిలీజ్ తర్వాత యశ్ తో ఫోన్లో మాట్లాడినప్పుడు, రివ్యూలు చూసి నేను కాస్త భావోద్వేగానికి లోనయ్యాను.

అయితే యశ్ నన్ను ఊరడిస్తూ..దీని గురించి ఎక్కువగా విచారించాల్సిన అవసరం లేదు, ఫలితాన్ని ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేద్దాం. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెడదాం అని ధైర్యం చెప్పారు అని పేర్కొన్నారు. ఆయన మాటల్లో ఎంతో నిరాశ, బాధ ఉన్నప్పటికీ నటుడిగా దాన్ని హుందాగా స్వీకరించారని తెలిపారు.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వెర్షన్లు మారుతూ వచ్చాయని, చివరికి ప్రేక్షకులకు ఏది నచ్చితే అదే అంతిమ తీర్పు అవుతుందని జయదేవ్ అభిప్రాయపడ్డారు. రిలీజ్ తర్వాత టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ జరగడంపై స్పందించిన యశ్ తల్లి పుష్ప, తన కొడుకు విజయాన్ని చూసి ఓర్వలేక కొందరు తొక్కేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేజీఎఫ్ కంటే ముందు కూడా యశ్ సాధించిన విజయాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారాలపై మండిపడ్డారు. ఒక పరాజయం ఎదురైనా, దాని నుంచి పాఠాలు నేర్చుకుని ప్రేక్షకులు మెచ్చే సరికొత్త ప్రాజెక్టులతో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు యశ్ సిద్ధమవుతున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story