రాసి పెట్టుకోండి.. నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది: రామ్ చరణ్

కెరీర్ లోనే ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుందని ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ సినిమాపై తనకున్న నమ్మకాన్ని అత్యంత ధీమాగా వ్యక్తపరిచారు.

Srinivas Rao
Published on: 25 May 2026 10:02 PM IST
రాసి పెట్టుకోండి.. నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది: రామ్ చరణ్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్ర కన్నడ వర్షన్ ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సినిమాపై ఆయన చూపిస్తున్న నమ్మకం, ధీమా చూస్తుంటే అభిమానులకు థియేటర్లలో ఒక మైండ్ బ్లోయింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

బెంగళూరు వేదికగా చరణ్ ఓపెన్ స్టేట్‌మెంట్!

బెంగళూరులో జరిగిన కన్నడ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ సినిమాపై తనకున్న నమ్మకాన్ని అత్యంత ధీమాగా వ్యక్తపరిచారు. “నేను చెబుతున్నాను రాసి పెట్టుకోండి.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘పెద్ది’ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ గా నిలిచిపోతుంది” అని రామ్ చరణ్ సంచలన ప్రకటన చేశారు.

కేవలం బెంగళూరులోనే కాదు, దీనికి ముందు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో కూడా చరణ్ ఇలాగే స్పందించారు. తన కెరీర్ లోనే ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలుస్తుందని అక్కడ పేర్కొన్నారు. ఒక స్టార్ హీరో తన సినిమా విడుదల కాకముందే ఇంతటి బలమైన నమ్మకాన్ని ప్రకటించడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దర్శకుడు బుచ్చిబాబు సన స్క్రిప్ట్ , అవుట్‌పుట్‌ను అంత అద్భుతంగా తెరకెక్కించారని, అందుకే చరణ్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి.

‘పెద్ది’భారీ తారాగణం.. సరికొత్త కాంబినేషన్స్

ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్, ‘కరుణాడ చక్రవర్తి’ డాక్టర్ శివరాజ్ కుమార్ ఒక అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, సీనియర్ నటులు జగపతి బాబు, బోమన్ ఇరానీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో పాటలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ జూన్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నేటి బెంగళూరు ఈవెంట్‌తో కన్నడ టెరిటరీలో కూడా ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story