Savitri Rejected NTR Film: గ్లామర్‌ పాత్రలకు సరిపోదన్నారని...ఎన్టీఆర్‌కు నో చెప్పిన సావిత్రి

Savitri Rejected NTR Film: కేవలం తన ఆహార్యం, అభినయంతోనే సినిమా ఇండస్ట్రీలో మహానటిగా గుర్తింపు పొందిన నటి సావిత్రి. తన కెరీర్‌లో ఎన్నోరకాలైన పాత్రలు పోషించింది.

Balachander
Published on: 26 April 2026 2:59 PM IST
Why Savitri Rejected NTR Film Over Glamour Role Debate
X

Savitri Rejected NTR Film: గ్లామర్‌ పాత్రలకు సరిపోదన్నారని...ఎన్టీఆర్‌కు నో చెప్పిన సావిత్రి

Savitri Rejected NTR Film: కేవలం తన ఆహార్యం, అభినయంతోనే సినిమా ఇండస్ట్రీలో మహానటిగా గుర్తింపు పొందిన నటి సావిత్రి. తన కెరీర్‌లో ఎన్నోరకాలైన పాత్రలు పోషించింది. కన్యాశుల్కం సినిమాలో వేశ్యగా తనదైన శైలిలో నటించి మెప్పించింది సావిత్రి. మహానటిగా ఆవిర్భవించిన తరవాత ఆ రకం పాత్రలకంటే నటనకు స్కోప్‌ ఉన్న చిత్రాల్లోనే నటించి మెప్పించింది. అయితే, ఓ సినిమాకోసం జరిగిన ఎంపికలో ఓ విషయం బయటకు వచ్చింది. సావిత్రిని కరుణ రసానికి పరిమితం చేస్తున్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌తో చేయవలసిన సత్య హరిశ్చంద్ర సినిమా నుంచి తప్పుకుంది. ఆనాటి హీరోయిన్లు వచ్చిన అవకాశాలు వదులుకోకుండా చేసేవారు. కానీ, చంద్రమతి పాత్రను సావిత్రి తిరస్కరించడం అప్పట్లో సంచలనంగా మారింది.

ఆ ఒక్క మాట.. సావిత్రి మనసు మార్చేసింది!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ సావిత్రిలు సక్సెస్‌ఫుల్‌ జోడి. వీరిద్దిరి కాంబినేషన్లో 26 సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. అయితే, ఓ సినిమా విషయంలో వీరిమధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. విజయ సంస్థ నిర్మించిన సత్య హరిశ్చంద్ర సినిమా దర్శకుడు కేవీ రెడ్డి... ఇందులో చంద్రమతి పాత్రకోసం సావిత్రిని ఎంచుకున్నారు. కానీ, ఆ సంస్థలో పనిచేస్తున్న ఓ ముఖ్యమైన వ్యక్తి సావిత్రి వద్ద చెప్పిన మాటలు ఆమెను ఆలోచింపజేశాయి. ఆ మాటలే ఆమెను ఈ సినిమా నుంచి తప్పుకునేలా చేశాయి.

గ్లామర్ వర్సెస్ ట్రాజెడీ!

ఇప్పుడే కాదు...పూర్వం బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లోనూ గ్లామర్‌ పాత్రలు ఉండేవి. కానీ, ఎంత వరకో అంతవరకే. గ్లామర్‌కు పరిమితులు తప్పనిసరి. కథే కీలకంగా ఉండేది. విజయ సంస్థ నిర్మించిన జగదేకవీరుని కథ సినిమాలో గ్లామర్‌ పాత్రకోసం బి సరోజను తీసుకున్నారు. ఆ సినిమా భారీ హిట్టయింది. కానీ, ఆ సినిమాలో అవకాశం సావిత్రికి రావాలి. కానీ, సావిత్రి గ్లామర్‌ కంటే ట్రాజెడీ కథలకే సూటవుతారు అనే నమ్మకం ఉండేది. సత్యహరిశ్చంద్ర సినిమాలో చంద్రమతి పాత్ర ఫుల్‌ ట్రాజెడీతో ఉంటుంది. ఆ పాత్రకు సావిత్రి సూటవుతుందని అనుకున్నారు. విజయ సంస్థలో పనిచేసే వ్యక్తి చెప్పిన విషయాలను ఆలోచించిన సావిత్రి...గ్లామర్‌ పాత్రలకు పనికిరానని, కేవలం తల్లి పాత్రలకే తనను పరిమితం చేస్తున్నారా అనే సందేహం ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. సత్యహరిశ్చంద్రలో పదేళ్ల బాబుకు తల్లిగా చేయాలి. ఇలా చేస్తే తన కెరీర్‌ ఇమేజ్‌ దెబ్బతింటుందని భావించింది. ఎన్టీఆర్‌ స్వయంగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు. ప్రాజెక్ట్‌ నుంచి పక్కకు తప్పుకుంది.

సావిత్ర కాదన్న తరువాత భానుమతిని అడిగి చూశారు. ఆమెకూడా నో చెప్పడంతో ఈ పాత్రలో ఎస్‌ వరలక్ష్మి నటించింది. విచిత్రం ఏమంటే ఈ సినిమా విడుదలైన తరువాత బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకున్నంతగా ఆడలేదు. ఒకవేళ చంద్రమతి పాత్రలో సావిత్రి నటించి ఉంటే ఈ సినిమా ఫలితం వేరేగా ఉండేదేమో అని ఆనాటి సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. గ్లామర్‌ పాత్రలకు పనికిరానన్నారనే కారణంతోనే సావిత్రి ఈ సినిమా నుంచి తప్పుకుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story