Vishwanath and Sons: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ ..టాక్ ఎలా ఉందంటే..?

Vishwanath and Sons: సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రానికి ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి సూపర్‌హిట్ టాక్ లభిస్తోంది.

Naresh.k
Published on: 14 Aug 2026 9:00 AM IST
Vishwanath and Sons
X

Vishwanath and Sons: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ ..టాక్ ఎలా ఉందంటే..?

Vishwanath and Sons: వర్సటైల్ స్టార్ సూర్య, మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు కాంబినేషన్‌లో తెరకెక్కిన సరికొత్త ఫ్యామిలీ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. 'సార్' వంటి విజయం తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

విదేశాల్లో ప్రీమియర్లు ప్రదర్శితం కావడంతో, సినిమా చూసిన నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఓవర్సీస్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకుల ప్రకారం.. వెంకీ అట్లూరి కథలోకి తీసుకెళ్లడానికి మొదటి 20 నిమిషాల సమయం తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత స్క్రీన్‌ప్లే వేగం పుంజుకుంది. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య తన నటనతో జీవించేశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. 'గజినీ'లోని సంజయ్ రామస్వామి నాటి మెరుపులు, ఎనర్జీ ఈ పాత్రలో మళ్లీ కనిపించాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

సూర్యకు జోడీగా నటించిన మమితా బైజు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, యాక్టింగ్ యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూర్య-మమితల మధ్య కెమిస్ట్రీ తెరపై చాలా ఫ్రెష్‌గా అనిపించింది. సూర్య, రాధికా శరత్‌కుమార్, మమితల మధ్య సాగే ఫ్యామిలీ డ్రామా, అనుబంధాలు బాగా పండాయి. హాస్పిటల్ సీన్, ట్రిప్ కామెడీ సీన్స్, హోటల్ ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ రెట్రో ట్రాక్ థియేటర్లలో సీటీలు కొట్టించేలా ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ప్లస్ పాయింట్లు

సూర్య, మమితా బైజు, రాధికల నటన

వెంకీ అట్లూరి మార్క్ స్క్రీన్‌ప్లే

సంగీతం & నిర్మాణం

మైనస్ పాయింట్లు

ప్రథమార్ధంలో మొదటి 20 నిమిషాలు కథనం కాస్త స్లోగా ఉంటుంది.

డబ్బింగ్, లిప్-సింక్ విషయంలో మరికొంత శ్రద్ధ వహించి ఉంటే బాగుండేదనేది కొందరి అభిప్రాయం.

తెలుగులో క్లాసికల్ హిట్స్‌గా నిలిచిన 'అత్తారింటికి దారేది', 'బొమ్మరిల్లు', 'మిస్టర్ పర్ఫెక్ట్' వంటి చిత్రాల్లోని ఎమోషన్స్, వినోదాన్ని వెంకీ అట్లూరి ఈ చిత్రంలో తనదైన శైలిలో రీ-క్రియేట్ చేశారని నెటిజన్లు కొనియాడుతున్నారు. హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు, సరదా వినోదం కావాలనుకునే వారికి ఈ పండగ సీజన్‌లో కుటుంబ సమేతంగా చూడదగ్గ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అని సోషల్ మీడియా రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story