Vishwanath & Sons Trailer : సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.. ట్రైలర్‌తో అంచనాలు పీక్స్.!

Vishwanath & Sons Trailer : తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. 'లక్కీ భాస్కర్'

G Krishna
Published on: 7 Aug 2026 6:51 PM IST
vishwanath-and-sons
X

vishwanath-and-sons

Vishwanath & Sons Trailer : తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. 'లక్కీ భాస్కర్' ఫేమ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్రాండ్‌గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభం నుంచే ఆహ్లాదకరమైన వినోదం, గుండెకు హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా, ప్రతి ఒక్కరి కుటుంబంతో కలిసి చూడదగ్గ అద్భుతమైన కథా చిత్రంగా ప్రేక్షకు ముందుకు రాబోతోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

నలభై ఏళ్ల షూటర్‌గా సూర్య అభినయం.. మమితా బైజు మెరుపులు

ట్రైలర్‌లో సూర్య ‘సంజయ్ విశ్వనాథ్’ అనే అంతర్జాతీయ స్థాయి పిస్టల్ షూటర్ పాత్రలో మెరిసారు. వయసు నలభై ఏళ్లు దాటినా తన ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడే వ్యక్తిగా, అదే సమయంలో స్టైల్, టైమింగ్ కామెడీ, ఎమోషన్స్‌తో అలరిస్తూ సూర్య తనదైన సహజసిద్ధ నటనను కనబరిచారు. ఇక ‘ప్రేమలు’ భామ మమితా బైజు తన నాజూకు అభినయంతో పాత్రకు జీవం పోసింది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, బాలీవుడ్ నటి రవీనా టాండన్‌తో పాటు ఇతర తారగణం ఈ కథలో భాగమై కుటుంబ బంధాల ప్రాధాన్యతను ఎంతో అందంగా చాటిచెప్పారు.

వెంకీ అట్లూరి మార్క్ మ్యాజిక్.. ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్

దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన హృద్యమైన మాటలతో కథను మలచగా, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మధురమైన నేపధ్య సంగీతం , నిమిష్ రవి ఛాయాగ్రహణం ట్రైలర్‌కు ప్రధాన బలముగా నిలిచాయి. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన ఆడియో వేడుకలో చిత్రబృందం వ్యక్తం చేసిన నమ్మకాన్ని ఈ ట్రైలర్ పూర్తిస్థాయిలో నిలబెట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్‌లో ప్రేక్షకులకు ఒక మర్చిపోలేని అనుభూతిని అందించనుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story