Vishwanath And Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల తేదీ ఫిక్స్
Vishwanath And Sons: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య), టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.
Vishwanath And Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల తేదీ ఫిక్స్
Vishwanath And Sons: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య), టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
ఇండిపెండెన్స్ డే వీకెండ్ టార్గెట్.. ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్
సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సుదీర్ఘ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ పర్ఫెక్ట్ డేట్‌ను లాక్ చేశారు. సూర్య కెరీర్లో 46వ చిత్రంగా (Suriya 46) వస్తున్న ఈ సినిమాలో, ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజూ ఒక ప్రత్యేకమైన మరియు కీలకమైన పాత్రలో నటిస్తోంది. టీజర్లో చూపించిన దాని ప్రకారం.. 40 ఏళ్ల ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్ పాత్రలో సూర్య, 20 ఏళ్ల యువతి పాత్రలో మమితా బైజూల మధ్య వచ్చే ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎ మోషన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
అద్భుతమైన కాస్టింగ్ & టెక్నికల్ వాల్యూస్
ఈ చిత్రానికి సంబంధించిన టాప్ క్లాస్ టీమ్ అప్డేట్స్ పరిశీలిస్తే.. సినిమాలో సూర్య సరసన మమితా బైజూ నటిస్తుండగా రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, భవాని శ్రీ, బ్జోర్న్ సూర్రావ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇక ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కథనం ప్రకారం ఆస్కార్ రేంజ్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తుండగా.. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ విజువల్స్ అందిస్తున్నారు , ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్న సూర్య, అదే జోష్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో ఈ ఆగస్టులో థియేటర్లను కొల్లగొట్టడానికి సిద్ధమవుతున్నారు.




