Aadarsha Kutumbam: 'సిట్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనకాడను'.. ఆసక్తి పెంచేసిన 'ఆదర్శ కుటుంబం' టీజర్!
Aadarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' అధికారిక టీజర్ విడుదలైంది.
Aadarsha Kutumbam: 'సిట్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనకాడను'.. ఆసక్తి పెంచేసిన 'ఆదర్శ కుటుంబం' టీజర్!
Aadarsha Kutumbam: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' (హౌస్ నంబర్: 47) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్ అవుతోంది. వింటేజ్ కామెడీ టైమింగ్‌తో పాటు కుటుంబ విలువలతో కూడిన అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా వచ్చిన టీజర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. త్రివిక్రమ్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టీజర్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్. థమన్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రంలోని పాటలకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృంద సిద్ధమైంది. ఈ చిత్ర నిర్మాణం కోసం మేకర్స్ సుమారు రూ. 60 కోట్లు నుంచి రూ. 80 కోట్లు వరకు బడ్జెట్ కేటాయించినట్లు ట్రేడ్ వర్గాల్లో సమాచారం. వెంకటేష్, త్రివిక్రమ్ క్రేజీ కాంబో ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. లేట్ ఎందుకు టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.!




