Varanasi movie: రాముడు వర్సెస్ కుంభకర్ణుడు.. గూస్‌బంప్స్ తెప్పించే 30 నిమిషాల క్లైమాక్స్
Varanasi movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాపై రైటర్ విజయేంద్ర ప్రసాద్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.
Varanasi movie: రాముడు వర్సెస్ కుంభకర్ణుడు.. గూస్‌బంప్స్ తెప్పించే 30 నిమిషాల క్లైమాక్స్
Vijayendra Prasad: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచరస్ విజువల్ వండర్ 'వారణాసి'. పాన్ ఇండియా రేంజ్‌ను దాటి గ్లోబల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఎప్పుడు ఏ చిన్న ముక్క బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా ఈ సినిమా కథ, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్‌పై స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఒక లీక్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
గూస్‌బంప్స్ తెప్పించే 30 నిమిషాల క్లైమాక్స్ వార్
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయాన్ని పంచుకున్నారు. 'వారణాసి' సినిమా కథలో ఎక్కువ భాగం 'రాముడు వర్సెస్ కుంభకర్ణుడు' తరహా పోరాటం చుట్టూ తిరుగుతుందని ఆయన హింట్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే ఆ 30 నిమిషాల హై-వోల్టేజ్ యుద్ధం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, అదే సినిమాకు మేజర్ హైలైట్ అని పేర్కొన్నారు. అంతేకాదు.. షూటింగ్ సెట్స్‌లో మహేష్ బాబును తొలిసారి రాముడి గెటప్‌లో చూసినప్పుడు నాకే గూస్‌బంప్స్ వచ్చాయి అని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించడం విశేషం.
అంటార్కిటికాలో రికార్డ్ షూట్
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పేలా రాజమౌళి ఈ చిత్రాన్ని దాదాపు రూ. 1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. సాంకేతికంగా సరికొత్త ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంటార్కిటికా ఖండంలోని గడ్డకట్టే మంచు కొండల్లో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి సినిమాగా 'వారణాసి' చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా శరవేగంగా జరుగుతోంది. ఇక్కడ కొన్ని కీలకమైన టాకీ పార్ట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటం సినిమాపై ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్ పెంచేసింది. అలాగే మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన పృథ్వీరాజ్ పోస్టర్ నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అన్ని రకాల హంగులతో, సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ లార్జర్ ద్యాన్ లైఫ్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తోంది.రాజమౌళి చెక్కిన శిల్పంలాంటి మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్ గ్రాండియర్, విజయేంద్ర ప్రసాద్ మార్క్ ఎమోషన్స్ అన్నీ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డుల వేట మొదలవుతుందో చూడాలి.




