Upasana: థియేటర్లలో ఉపాసన రచ్చ రచ్చ.. చరణ్‌ ఎంట్రీకి పేపర్లు విసిరేస్తూ సెలబ్రేషన్స్!

Upasana: ‘పెద్ది’ ప్రీమియర్ షోలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన సందడి చేశారు.

Naresh.k
Published on: 4 Jun 2026 8:08 AM IST
Upasana
X

Upasana: థియేటర్లలో ఉపాసన రచ్చ రచ్చ.. చరణ్‌ ఎంట్రీకి పేపర్లు విసిరేస్తూ సెలబ్రేషన్స్!

Ram Charan Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో సందడి మొదలైంది. నిన్న రాత్రి పడిన ప్రీమియర్ షోల నుంచే ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ‘పెద్ది’ ప్రీమియర్స్ సందర్భంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల థియేటర్‌లో చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఫ్యాన్స్ మోడ్‌లోకి ఉపాసన

హైదరాబాద్‌ బాలానగర్‌లోని ఒక థియేటర్ లో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్‌కు ఉపాసన హాజరయ్యారు. సాధారణంగా సెలబ్రిటీ హోదాలో సైలెంట్‌గా సినిమా చూసే ఉపాసన.. ఈసారి మాత్రం పక్కా మాస్ మెగా అభిమానిగా మారిపోయారు. థియేటర్ లో అభిమానుల మధ్య కూర్చుని సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

ముఖ్యంగా స్క్రీన్‌పై రామ్ చరణ్ మాస్ ఎంట్రీ ఇవ్వగానే.. ఉపాసన థియేటర్ లో మిగతా ఫ్యాన్స్ తరహాలోనే గట్టిగా కేకలు వేశారు. అంతేకాదు.. ఫుల్ జోష్‌లో పేపర్లు గాల్లోకి విసిరేస్తూ చరణ్ ఎంట్రీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసనలోని ఈ సరికొత్త మాస్ యాంగిల్‌ను చూసి పక్కనున్న ఫ్యాన్స్ కూడా షాక్ అవుతూ మరింత జోష్ పెంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ వైఫ్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

థియేటర్లలో ‘పెద్ది’ జాతర

ప్రీమియర్ షోల నుంచే ‘పెద్ది’ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్లన్నీ కోలాహలంగా మారాయి. రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో, కుస్తీ ఎపిసోడ్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఉపాసన జోష్‌తో మొదలైన ఈ ‘పెద్ది’ జాతర.. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story