Trisha: కమల్, రజనీ మూవీ ఆఫర్ కు త్రిష నో.. అసలు రహస్యం ఇదేనా?
Trisha: నటి త్రిష ప్రస్తుత కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎవరైనా అసూయ పడాల్సిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు.
Trisha: కమల్, రజనీ మూవీ ఆఫర్ కు త్రిష నో.. అసలు రహస్యం ఇదేనా?
Trisha: నటి త్రిష ప్రస్తుత కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎవరైనా అసూయ పడాల్సిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. అయితే, తాజాగా ఆమెకు సంబంధించిన ఒక సంచలన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. కోలీవుడ్ దిగ్గజాలు కమల్ హాసన్ - రజనీకాంత్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం నుంచి త్రిష తప్పుకున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రానున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఆమెకు ఏకంగా రూ.12 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
సుదీర్ఘ విరామం తర్వాత అగ్ర హీరోల కలయిక
భారతీయ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కలయికగా ఈ చిత్రం నిలవనుంది. లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు నలభై ఆరు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకే తెరపై కలిసి నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా అపారమైన ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరు దిగ్గజాల స్థాయికి తగినట్లుగా, కథలో అంతే ప్రాధాన్యత ఉన్న కథానాయిక పాత్ర కోసం చిత్ర బృందం మొదట త్రిషను సంప్రదించింది. ఇందుకోసం ఆమెకు టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలో ఏ హీరోయిన్‌కు లేని విధంగా రికార్డు స్థాయిలో భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.
ఆంగ్ల మీడియా కథనాల్లో రాజకీయ కోణాలు
ఇంతటి భారీ అవకాశాన్ని, కళ్లు చెదిరే పారితోషికాన్ని త్రిష తిరస్కరించడం వెనుక పరిశ్రమలో బలమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'రెడ్ జెయింట్ మూవీస్' నిర్మిస్తుండడమే త్రిష తప్పుకోవడానికి ప్రధాన కారణమని ఆంగ్ల మీడియా ప్రత్యేకంగా పేర్కొంది. భవిష్యత్తులో వచ్చే కొన్ని పరిణామాలను , తన వ్యక్తిగత కెరీర్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకునే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో త్రిష అసలు నటిస్తోందా లేదా అనే విషయంపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీ
ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, త్రిష కెరీర్ ప్రస్తుతం అత్యున్నత దశలో కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన 'వీరభద్రుడు' చిత్రంలో న్యాయవాది ప్రీతి పాత్రలో ఆమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' అనే భారీ బడ్జెట్ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ భారీ చిత్రంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.




