Toxic Trailer : ‘టాక్సిక్’ ట్రైలర్‌లో యశ్ విశ్వరూపం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
Toxic Trailer : కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'టాక్సిక్' (Toxic – A Fairy Tale for Grown-ups) అనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Toxic Trailer
Toxic Trailer : కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 'టాక్సిక్' (Toxic – A Fairy Tale for Grown-ups) అనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ సృష్టించిన సంచలనం, విమర్శల కలకలం ముగియకముందే చిత్రయూనిట్ శనివారం సాయంత్రం విడుదల చేసిన ఆఫీషియల్ ట్రైలర్ నెట్టింట తుఫాను సృష్టిస్తోంది.
డార్క్ విజువల్స్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యశ్ మాస్ లుక్..
తెలుగు ట్రైలర్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియా ట్రెండ్స్‌ను షేక్ చేస్తోంది. "దిస్ వాస్ సపోజ్డ్ టు బి మై ఫెయిరీ టేల్" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్, అత్యంత డార్క్, విజువల్లీ రిచ్ అండ్ మాసివ్ వయలెంట్ అట్మాస్ఫియర్‌తో సాగింది. సర్కస్ బ్యాక్‌డ్రాప్, భారీ గన్ ఫైట్లు, మంచు కొండలు, ఫైర్ బ్లాస్ట్ ల నడుమ యశ్ కనిపించిన మాస్ అండ్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులకు ఒక సరికొత్త సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోంది. మేకింగ్ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు ప్రచార చిత్రాన్ని చూస్తే స్పష్టమవుతోంది.
నయనతార, కియారా నటన పీక్స్.. 40కి పైగా భాషల్లో గ్రాండ్ రిలీజ్..
ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ముఖ్యంగా కియారా అద్వానీ గ్లామరస్ లుక్స్, నటన ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, లేడీ విలన్ డాన్‌గా నయనతార అత్యంత మాస్ షేడ్‌లో కనిపించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ సినిమా రేంజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్ ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40కి పైగా భాషలలో థియేటర్లలోకి రానుంది.




