Toxic Movie: ‘టాక్సిక్’ టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
Toxic Movie Ticket Hike: రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమాకి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Toxic Movie: ‘టాక్సిక్’ టికెట్ల రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
Toxic Movie Ticket Hike: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ (Toxic). భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు కేవీఎన్ ప్రొడక్షన్స్ చిత్ర బృందానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ జీవో ప్రకారం.. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించారు.
సింగిల్ స్క్రీన్లలో: రూ.50 వరకు పెంపు (జీఎస్టీతో కలిపి)
మల్టీప్లెక్స్‌లలో: రూ.100 వరకు పెంపు (జీఎస్టీతో కలిపి)
ఈ పెంచిన ధరలు సినిమా విడుదలైన నాటి నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. అంతేకాకుండా, రోజుకు 5 షోలు (ప్రత్యేక ప్రదర్శనలు) వేసుకునేందుకు సైతం ప్రభుత్వం అనుమతించింది. ఇదే సమయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీకి రూ.1 కోటి డిపాజిట్ చేయాలని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని 3 గంటల 14 నిమిషాల రన్ టైమ్‌తో పూర్తి స్థాయి మాస్ అండ్ వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు.




