Tamil Sequels: పార్ట్-1 హిట్‌.. 'పార్ట్-2' ఫట్టు.! ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోతున్న తమిళ సీక్వెల్స్.. లిస్టు ఇదిగో

Tamil Sequels: తమిళంలో పార్ట్-1 హిట్టయిన సినిమాలు సీక్వెల్‌గా వచ్చినప్పుడు ఎందుకు ఫ్లాట్ అవుతున్నాయి.

Ravi
By Ravi
Published on: 14 Sept 2026 4:40 PM IST
Tamil Sequels
X

Tamil Sequels: పార్ట్-1 హిట్‌.. 'పార్ట్-2' ఫట్టు.! ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోతున్న తమిళ సీక్వెల్స్.. లిస్టు ఇదిగో

Tamil Sequels: భారతీయ సినీ పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. మొదటి భాగం సంచలన విజయం సాధించినప్పుడు రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగిపోతుంటాయి. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం 'పార్ట్-1' హిట్టవుతుండగా, 'పార్ట్-2' మాత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా ఫ్లాట్ అవుతుండటం గమనార్హం. అప్పటికప్పుడు వచ్చిన బిల్లా-2 నుంచి నిన్నటి సర్దార్-2 వరకు ఇదే రకమైన నిరాశపరిచే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సీక్వెల్స్ జాబితా పరిశీలిస్తే ఇండియన్-2, చంద్రముఖి-2, సామీ-2, పందెంకోడి-2, విశ్వరూపం-2, రఘువరన్ బీటెక్-2 వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మొదటి భాగం సృష్టించిన మేజిక్‌ను రెండవ భాగం రిపీట్ చేయడంలో విఫలమవుతున్నాయి.

అంచనాలను అందుకోలేకపోవడం, కథలో కనెక్షన్ మిస్ కావవడం, స్క్రీన్ ప్లే సాగదీయడం ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. రెండు భాగాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండటమే ఈ డిజాస్టర్లకు అసలు కారణం అని పరిశీలకులు చెబుతున్నారు. కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల రుచి మారుతుంది. కానీ దర్శక నిర్మాతలు పాత ఫార్ములానే నమ్ముకుంటూ ముందుకు వెళ్లడం వల్ల ఫలితం తారుమారవుతోంది. బడ్జెట్ పరంగా చూస్తే ఈ సీక్వెల్స్ చిత్రాలకు నిర్మాతలు రూ. 50 కోట్లు నుంచి రూ. 150 కోట్లు వరకు వెచ్చిస్తున్నారు. కానీ కంటెంట్ బలహీనంగా ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు రావడం లేదు. ఫలితంగా కోట్లాది రూపాయల నష్టాలు వస్తున్నాయి.

మొదటి భాగంలో ఉన్న భావోద్వేగాలు, క్యారెక్టర్ ఎలివేషన్లు సీక్వెల్స్‌లో పండకపోవడం మైనస్‌గా మారుతోంది. కేవలం బ్రాండ్ నేమ్ నమ్ముకుని సినిమా తీయడం వల్ల ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఈ పరాజయాల నుంచి మేకర్స్ తగిన పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో వచ్చే సీక్వెల్స్ కోసం స్క్రిప్ట్ వర్క్‌పై మరింత పట్టు ఉండాలి. గ్యాప్ తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవడం అవసరం. నాణ్యమైన కంటెంట్ అందిస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. లేదంటే ఎంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఫలితం నిరాశజనకంగానే ఉంటుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.