'Viswanath & Sons': ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ..స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

'Viswanath & Sons': సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.

Gagan kumar
Published on: 7 Sept 2026 12:22 PM IST
Viswanath & Sons
X

'Viswanath & Sons': ఓటీటీలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ..స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

'Viswanath & Sons'OTT Release: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఆగస్టు 14న విడుదలవుతూనే విమర్శకులు, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం బుల్లితెర వీక్షకులను, ఓటీటీ ప్రియులను అలరించేందుకు డిజిటల్ బాట పట్టింది.

సూర్య సరసన మలయాళ భామ మమిత బైజు కథానాయికగా నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచింది. ఎమోషనల్ అండ్ హ్యూమరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య యాక్టింగ్, వెంకీ అట్లూరి టేకింగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ, ఈ ఏడాది తమిళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ చిత్రాల సరసన నిలిచింది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కైవసం చేసుకుంది.సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో మిస్ అయిన సినిమా ప్రేమికులు, మళ్లీ మళ్లీ చూడాలనుకునే సూర్య అభిమానులు ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్లాస్, మాస్, ఎమోషన్స్ సమపాళ్లలో కుదిరిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా ట్రెండింగ్‌లో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story